ఐపీఎల్‌లో వేలం పాటల్లో సరికొత్త రికార్డు : శామ్ కరన్ ధర రూ.17.50 కోట్లకు

శుక్రవారం, 23 డిశెంబరు 2022 (17:32 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం ఆటగాళ్ల ఎంపిక కోసం సెమీ వేలం పాటలను కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ వేలం పాటల్లో ఇంగ్లండ్ క్రికెటర్లు సరికొత్త రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా శామ్ కరన్, హ్యారీ బ్రూక్‌లు రికార్డులు నెలకొల్పారు. శామ్ కరన్ ఏకంగా రూ.18.50 కోట్ల ధరకు అమ్ముడు పోగా, హ్యారీ బ్రూక్ రూ.13 కోట్లకు అమ్ముడయ్యారు. శామ్ కరన్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీగా వేలం పాట జరిగింది.
 
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శామ్ కరన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, చివరకు అతనిని రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు దక్కించుకుంది. 2008 నుంచి ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క ఆటగాడు కూడా ఈ తరహా ధరకు అమ్ముడు పోలేదు. 
 
అలాగే, ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం శుక్రవారం నాటి వేలం పాటల్లో సంచలనం సృష్టించాడు. గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. కామెరూన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, ముంబై ఇండియన్స్ చివరకు రూ.17.50 కోట్లకు దక్కించుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం గమనార్హం. 
 
అదేవిధంగా ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు బెన్ స్టోక్స్ సైతం కోట్లు కొల్లగొట్టాడు. ఈ సారి వేలంలో నిలిచిన స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.16.25 కోట్లకు సొంతం చేసుకుంది. స్టోక్స్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. చివరకు రూ.15 కోట్ల వద్ద సన్ రైజర్స్ జట్టు తప్పుకుంది. దీంతో లక్నో సూపర్ జెయింట్ స్టోక్స్‌ను దక్కించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు