వన్డే మ్యాచ్‌ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మంజ్రేకర్‌ను ట్రోల్ చేస్తున్న?

మంగళవారం, 5 మార్చి 2019 (11:21 IST)
వన్డే మ్యాచ్‌ను టెస్టులో ఆడే నువ్వు కూడా ఇలా మాట్లాడుతావా అంటూ మంజ్రేకర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇందుకు కారణం.. 50 ఓవర్ల మ్యాచ్ చూస్తున్న ప్రతిసారీ పది ఓవర్లు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలే. ఈ ట్వీట్స్ ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. 
 
అంతే మంజ్రేకర్‌ను సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు. కామెంట్రీ బాక్సులో వున్నప్పుడు తాను స్నేహితుడితో ఇలాగే అంటుంటానని.. కొందరంటే.. పట్టుమది పది ఓవర్లు కూడా ఆడలేవు.. నువ్విలా మాట్లాడటం ఏమిటని కామెంట్ చేశారు.
 
అంతేగాకుండా 40 ఓవర్లు అయ్యాక నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని, నిజంగా 40 ఓవర్ల మ్యాచ్ ఉన్నా ఇలాంటి డైలాగే చెబుతావని వెల్లడించారు. ప్రస్తుతం మంజ్రేకర్ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు