డియర్‌ పాక్‌ ట్రోల్స్‌.. మీ నీచమైన మెంటాలిటీ చూస్తే నవ్వొస్తుంది.. ఉగ్రవాదులే...

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (15:00 IST)
భారత్ పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. విషయం మాటలతో కూకుండా ఇప్పుడు దాడుల వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ నటులు సైతం భారతీయ వైమానిక దళాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి పాకిస్థాన్ నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
పాకిస్థాన్‌లో పుట్టిన అద్నాన్ సమీ కొన్నేళ్ల క్రితం భారత పౌరసత్వాన్ని తీసుకున్నారు. పుల్వామా ఘటనకు ప్రతిగా పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో సమీ భారత్‌కు మద్దతిస్తూ భారత వైమానిక దళం పట్ల ఎంతో గర్వంగా ఉందని, ఉగ్రవాదాన్ని ఆపండి, జైహింద్ అంటూ తన ట్విట్టర్ పేర్కొన్నారు. కాగా ఈ కామెంట్స్‌పై పాకిస్థానీ నెటిజన్లు సమీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. 
 
దీనిపై సమీ ట్విట్టర్ వేదికగా దీటైన జవాబు ఇచ్చారు. డియర్‌ పాక్‌ ట్రోల్స్‌.. ఇక్కడ మీ ఇగో విషయం కాదు. మీరు శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదుల ఏరివేత ఇక్కడ ముఖ్య విషయం. మీ నీచమైన మెంటాలిటీ పట్ల నవ్వొస్తోందని, మీ మాటలే మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు