రన్స్ చేయడమే సర్ఫరాజ్ తప్పా? వెస్టిండీస్ టూర్‌కు భారత జట్టు

శనివారం, 24 జూన్ 2023 (14:43 IST)
విండీస్ టూర్‌కు టీమిండియాను బీసీసీఐ ఎంపిక చేసింది. దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్న యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి మొండి చెయ్యే చూపించడంపై ఫ్యాన్స్, క్రికెటర్లు మండిపడుతున్నారు. అతను చేసిన పాపం ఏంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
 
కొంతకాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 79 సగటుతో 3,505 పరుగులు చేశాడు. ఇందులో ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.
 
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలతో పోలిస్తే సర్ఫరాజ్ ఖాన్‌దే పైచేయి. అయితే సర్ఫరాజ్‌ను పక్కనబెట్టేశారు. 
 
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే టీమ్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్‌కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు