భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు షాక్ తగిలింది. త్వరలో జరుగనున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను దూరంగా పెట్టలేమని ఐసీసీ తేల్చచెప్పలేదు. పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో సంబంధాలు తెంచుకోవాలంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే.
దీనిపై ఐసీసీ స్పందిస్తూ, ఇలాంటి విషయాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. అయితే ఇలాంటిది చేసే అవకాశం అస్సలు లేదు. దేశాలపై నిషేధం అన్నది ప్రభుత్వాల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఇందులో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదని ఐసీసీ చైర్మన్ స్పష్టం చేశారు.