ఓవర్ స్పీడ్.. షేన్‌వార్న్‌కు ఊహించని షాక్.. ఏడాది పాటు నిషేధం

మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:17 IST)
ఆస్ట్రేలియా స్పిన్ స్టార్ షేన్‌వార్న్‌కు ఊహించని షాక్ తగిలింది. రెండేళ్లలో ఆరుసార్లు అతివేగంతో కారు నడిపిన కారణంగా షేన్ వార్న్ ఏడాది పాటు డ్రైవింగ్ నిషేధానికి గురయ్యాడు. వార్న్ ఏడాది పాటు డ్రైవింగ్ చేయకుండా లండన్ న్యాయస్థానం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఇంగ్లండ్‌లోని వెస్ట్ లండన్‌లో ఉంటున్న వార్న్.. గంటకు 40 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో 47 మైళ్లతో తన కారులో ప్రయాణించాడు. గతేడాది లండన్‌లో 64 కిలోమీటర్ల వేగాన్ని వార్న్‌ అతిక్రమించాడు. వార్న్ ఇప్పటికే ఆరు సార్లు ఇలాంటి తప్పిదానికి పాల్పడ్డాడని స్పష్టం చేసిన కోర్టు అతడిపై చర్యలు తీసుకుంది. 
 
నిబంధనలను ఉల్లఘించి అతివేగంగా కారును నడిపినందుకు ఏడాది పాటు డ్రైవింగ్ నిషేధంతో పాటు 1,845 పౌండ్ల (దాదాపు రూ.లక్షా 62వేలు)ను చెల్లించాలని లండన్ న్యాయస్థానం వార్న్‌ను ఆదేశించింది. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని శిక్షను విధించామని న్యాయమూర్తి టర్నర్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు