ఆత్మహత్య చేసుకుంటాడేమోనని ఫ్రెండ్‌ని ఇంటికి తెస్తే అతడి భార్యను లొంగదీసుకుని...
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (14:14 IST)
పెళ్ళయిన తరువాత ప్రేమించడం సహజమే. అయితే కట్టుకున్న భర్త కన్నా ప్రియుడే గొప్ప అని నమ్మింది. ఐతే ఆమె, తన ప్రేమికుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. వివాహితతో పాటు ఆమె కుమార్తెను అతి దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్ లోని రామాంతపూర్ ప్రాంతంలో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
రామాంతపూర్‌లో లీలా, రాములు గత ఆరు సంవత్సరాలుగా నివాసముంటున్నారు. వీరికి ఐదేళ్ళ కుమార్తె ఉంది. రాము స్థానికంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాము మృదుస్వభావి. తన స్నేహితులకు ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాడు. స్నేహితులే కాదు ఎవరికైనా సమస్య అని వచ్చి తన దృష్టికి వస్తే తన వంతు ఆర్థిక సహాయం చేస్తాడు. అదే అతని జీవితాన్ని నాశనం చేయడానికి ప్రధాన కారణంగా మారిందని చెప్పొచ్చు.
తన స్నేహితుడు రాజేష్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో అప్పులవారు తన దగ్గరకు ఎక్కడకు వస్తారేమోనని ఉద్యోగం మానేసి తప్పించకుంటూ తిరగడం ప్రారంభించాడు. అంతేకాదు ఒకసారి ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. దీంతో స్నేహితుడు రాజేష్ సమస్యను తెలుసుకున్న రాము తన ఇంటికి తీసుకెళ్ళాడు. నీకు ఎన్నిరోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు.. అంతే తప్ప ఆత్మహత్య చేసుకోవద్దన్నాడు.
దీంతో రాజేష్ ఆ ఇంటిలోనే ఉంటూ వచ్చాడు. చివరకు రాము భార్య లీలపై కన్నేశాడు రాజేష్. ఎలాగైనా ఆమెను లొంగదీసుకుని డబ్బు కోసం రామును బ్లాక్‌మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మెల్లగా ఆమెను బుట్టలో వేశాడు. వారం క్రితం ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అంతేకాదు ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. పుట్టింటికి వెళ్ళి రెండురోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళింది లీల.
రాజేష్ కూడా వారంరోజుల తరువాత వస్తానని రాముకు చెప్పి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ లోని ఉప్పల్ సమీపంలోకి వెళ్ళారు. అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు రాజేష్. రెండురోజులు కాపురం పెట్టాడు. ఆ రెండు రోజులు ఆమెతో హాయిగా గడిపాడు.
కానీ ఈ రెండు రోజుల్లోనే రాజేష్ నిజస్వరూపం అతడి స్నేహితులతో మాట్లాడుతుండగా విన్నది లీల. తీవ్ర ఆవేదనకు గురైంది. తప్పు తెలుసుకుని భర్త దగ్గరకు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. అయితే రాజేష్ ఆమెను అడ్డుకున్నాడు. లీలతో పాటు చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. నిందితుడిని ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.