టీమిండియాకు గట్టి దెబ్బ: శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ ఫీవర్

శుక్రవారం, 6 అక్టోబరు 2023 (10:30 IST)
టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. ప్రపంచ కప్ నేపథ్యంలో స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు డెంగ్యూ ఫీవర్ రావడంతో ఆస్ట్రేలియాతో ఆడేది డౌటేనని తెలుస్తోంది. 
 
ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడినట్లు బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి.
 
శుక్రవారం (అక్టోబర్ 6) అతనికి మరోసారి టెస్టులు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ తర్వాతే అతనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆడిన తర్వాత మూడో వన్డేకు అతనికి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు