దంబుల్లా వన్డేలో భారీ స్కోరు చేసేలా కనిపించిన ఆతిథ్య బృందం 216 స్కోరు వద్దే కుప్పకూలింది. ‘జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఓటమి భయం పెరిగింది. ఆటగాళ్లు ఆత్మస్థైర్యంతో కనిపించడం లేదు. మధ్యలోనే చాప చుట్టేస్తున్నారు. త్వరగా దీనికి పరిష్కారం కనుక్కోవాలి. టెస్టు సిరీస్ ప్రదర్శన పట్ల వారంతా నిరాశలో ఉన్నారు. నంబర్ వన్ జట్టుతో తమను తాము నిరూపించుకోవడం లంక ఆటగాళ్లకు సవాలే’ అని జయవర్ధనే అన్నారు.
కోహ్లీ.. పాండ్యా సూపర్ టీమిండియా సారథి విరాట్‌కోహ్లీని జయవర్ధనే ప్రశంసించారు. ‘కోహ్లీ చురుగ్గా, దూకుడుగా ఉంటాడు. ఆటను చక్కగా ఆరంభిస్తాడు. ఎక్కువగా సొంత మైదానంలో ఆడినా అవీ గెలిచాడు. మైదానంలో, బయటా కుర్రాళ్లకు చక్కగా నాయకత్వం వహిస్తున్నాడు. అందరూ బాధ్యతలు పంచుకొనేలా కేంద్రంగా నిలిచాడు. అందుకే జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ స్థానాల కోసం పోటీ ఉంది. ఇక హార్దిక్ పాండ్యా ప్రతిభ అద్భుతం. అతడు 130-140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం సానుకూల అంశం. బ్యాటింగ్ నైపుణ్యం కూడా అంతే. సరైన సమయంలో భారీ షాట్లు ఆడగలడు. పాండ్యా జట్టుకు సమతూకం తెస్తున్నాడు’ అని జయవర్ధనే అభిప్రాయ పడ్డారు.