స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను గ్యారేజ్‌లో పడేసిన తండ్రి (Video)

ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (13:42 IST)
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని యేడాది నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను అతని తండ్రి పీటర్ గ్యారేజ్‌లో పడేశారు. ఇక యేడాది వరకు దాని అవసరం లేదంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కిట్‌ను చూస్తూ ప్రతి రోజూ తన కొడుకు కుమిలిపోవడం తనకు ఇష్టం లేదని పీటర్ చెప్పారు. అతను బాగానే ఉన్నాడు.. ఈ సంక్షోభం నుంచి బయటపడతాడు.. అంటూ క్రికెట్ కిట్‌ను పడేసే సమయంలో పీటర్ అన్నారు. 
 
కాగా, దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి పర్యటన మధ్యలోనే స్మిత్ స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సిడ్నీలో స్మిత్ విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన తండ్రి పీటర్ వెనుకనే నిలబడి ఓదార్చారు. ఆస్ట్రేలియాను, అభిమానులను బాధపెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ స్మిత్ ఫ్యాన్స్‌ను కోరాడు. 
 
మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లతో కలిసి స్మిత్ ఈ బాల్ ట్యాంపరింగ్‌కు ప్లాన్ చేశాడు. బాన్‌క్రాఫ్ట్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఈ బాగోతమంతా బయటపడింది.

 

Steve Smith's Father Peter Smith Dumps His Cricket Kit pic.twitter.com/O7WArgbEZT

— Desi Stuffs (@DesiStuffs) March 31, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు