ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఐపీఎల్ నాశనం చేసింది.. స్టీవ్ వా కామెంట్స్

ఆదివారం, 23 అక్టోబరు 2016 (15:37 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) పోటీలపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా సంచలన ఆరోపణలు చేశారు. ఐపీఎల్ వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ నాశనమైందని మండిపడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ వైఫల్యాల బాటలో నడుస్తూ నాశనమైపోతోందన్నాడు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఐపీఎల్‌లో ఆడుతున్న కారణంగా ఆటగాళ్లు అలసటకు గురవుతూ, తర్వాతి షెడ్యూళ్లలో పూర్తి స్థాయి ప్రదర్శనను కనబరచలేక పోతున్నారని అభిప్రాయపడ్డాడు. 
 
రెండు నెలల క్రితం లంకతో 3-0తో, ఆపై ఇటీవల దక్షిణాఫ్రికాలో ఐదు వన్డేల సిరీస్‌ను 5-0తో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓడిపోవడం తనను బాధించిందన్నాడు. తాము క్లబ్ క్రికెట్‌లో ఆడిన సమయంలో ఈ తరహా వాతావరణం లేదని, ఇప్పుడు పోటీతోపాటు, ఆటగాళ్లు గాయాల పాలయ్యే అవకాశాలూ పెరిగాయని అన్నాడు. 

వెబ్దునియా పై చదవండి