మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

దేవీ

సోమవారం, 7 జులై 2025 (18:06 IST)
Mr. Soldier
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నుండి సుమారు 13 కిలోమీర్లు దూరంలో గల మిలిటరీ మాధవరం గామాన్ని ఆదర్శంగా  చేసుకొని  శ్రీ ధరణి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత  VRM  పట్నాయక్  USN పట్నాయక్  Mr. Soldier (From milatury Madhavaram) అనే చిత్ర నిర్మాణం విజయ వంతంగా పూర్తి చేయటం జరిగినది.
 
ఈ చిత్ర నిర్మాణము కొరకు మిలిటరీ గ్రామా మాజీ సైనికోద్యోగుల సంఘం, గ్రామ సర్పంచ్, ప్రజలకు  శ్రీ ధరణి ఆర్ట్స్ సంస్ద తరుపున అభినందనలు తెలియ చేస్తున్నాము. Mr. సోల్జర్ ( ఫ్రమ్ మిలటరీ మాధవరం) సెన్సార్ పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాలలో ఆగస్టు 2 వ వారంలో విడుదలకు సిద్దంగా ఉన్నందున  మేము ఎంతో గర్వపడుచున్నాము. Mr. సోల్జర్ సినిమా కథా సారాన్ని క్లుప్తంగా మా ప్రేక్షకులకు వివరిస్తూ మీ ముందుకు మా సంస్ధ వస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నామని చిత్ర టీమ్ తెలియజేసింది.
 
భారత దేశం రాజధాని ఢిల్లీ లో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఊరు ఈ  మిలిటరీ మాధవరం గ్రామం. ఈ గ్రామం నుంచి మొదటి, రెండవ ప్రపంచ ముద్దంలో సుమారు 2,000 మంది సైనికులు పాల్గొని దేశానికి ఎంతో సేవలను అందించి, సుమారు పదుల సంఖ్యలో ఆశువులు బాసారు. దేశ స్వతంత్రం అనంతరము దేశ రక్షణలో బాగంగా సుమారు 5000 మంది సైనికులు ప్రస్తుతము ఇండియన్ ఆర్మీ రక్షణ రంగం లో చేరి సేవలు అందిస్తున్నారు. 
 
1970 వ సంవత్సరంలో మేజర్ రాజు అనే నిజాయితీ గల ఆర్మీ ఆఫీసర్ ఎంతో మంది శత్రువులను తుదముటించి యుద్ధరంగం లో,ఎన్నో పతకాలు పొంది ఉన్నారు. అలాంటి మేజర్ రాజు నిరాధార ఆరోపణలు ఎదుర్కొని, అవమానాలను భరించి భారతమాత సాక్షిగా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారు. కానీ యీ నాటికి మేజర్ రాజు మిలట్రీ మాధవరం గ్రామంలో యువత ప్రేరణ పొందుతూ ప్రతి ఇంటి నుండి పదుల సంఖ్యలో ఇండియన్ ఆర్మీకి పంపిస్తుందని ఆ గ్రామ ప్రజలకు నమ్మకం. 
 
ఒక వేళ ఆకస్మిక యుద్ధం వస్తే దేశ రక్షణకు ప్రతి గ్రామం నుండి పదుల సంఖ్యలో సైనికులు ఇండియన్ ఆర్మీ లో చేరవలసిన సమయం ఆసన్న మైందని... కథా సారాంశం తో జరిగిన యదార్ధ కథను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు, శ్రీ ధరణి ఆర్ట్స్ సంస్ద తరుపున మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి, ఆదరించి మా సంస్థ బృందాన్నీ  ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామని చిత్ర టీమ్ తెలియజేస్తుంది.
 
నటీ నటులు :  పృధ్యీ రాజు, గోలిసోడా మధు , శ్రీనివాస్ దంపగల, గోపి నాధ్, ఓంకార్, శివం కిరణ్, జూ, రాజనాల ఈశ్వర్ శ్రీలు, మధు ప్రియా , స్వప్న శ్రీ,  అదియా, మధుశ్రీ, కనక దుర్గమ్మ, పబ్లిసిటీ డిజైన్స్ : రాంబాబు పోస్టర్ యాడ్స్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు