సాధారణంగా వెలుతురు లేని కారణంగా లేదా వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్‌లను నిలిపివేయడం చూస్తుంటాం. కానీ, భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య బుధవారం నేపియర్ ప్రారంభమైన మ్యాచ్ వెలుతురు కారణంగా ఆగిపోయింది. సూర్యకాంతి నేరుగా బ్యాట్స్‌మెన్లు, అంపైర్ల కంటిలో పడుతుందన్న కారణంగా మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
కివీస్ గడ్డపై పర్యటిస్తున్న భారత జట్టు బుధవారం ఆతిథ్య కివీస్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. ఇందులోభాగంగా, బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.
ఈ దశలో సూర్యకాంతి నేరుగా బ్యాట్స్‌మెన్ కంట్లో పడుతుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. 'సూర్యకాంతి నేరుగా బ్యాట్స్‌మెన్ కంట్లో పడుతోంది. కాబట్టి ఆటగాళ్ల, అంపైర్ల భద్రత దృష్ట్యా మ్యాచ్‌ను నిలిపేశాం. పరిస్థితులు మెరగయ్యాక మ్యాచ్‌ను తిరిగి ప్రారంభిస్తాం అని ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు.
దీనిపై అంపైర్ షాన్ హాగ్ స్పందిస్తూ, తన 14 ఏళ్ల కెరీర్‌లో సూర్యుడి కారణంగా మ్యాచ్ ఆగిపోవడం ఇదే తొలిసారి. అయితే మ్యాచ్‌కు మరో అరగంట అదనపు సమయం ఉంది. మరో అరగంటలో పరిస్థితులు మెరుగుపడి మ్యాచ్ తిరిగి ప్రారంభమైతే పూర్తిగా 50 ఓవర్ల ఆట సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.