Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

దేవీ

శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (19:50 IST)
Atharva Murali Tunnel movie new poster
మెగా జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి బుధవారం (సెప్టెంబర్ 10) పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో లావణ్య త్రిపాఠి నటించిన ‘టన్నెల్’ టీం స్పెషల్ విషెస్‌ను అందించింది. తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు ‘టన్నెల్’ మేకర్స్ కంగ్రాట్స్ తెలిపారు.
 
రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఓ వారం వాయిదా వేశారు. అలా ఈ మూవీని సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లోకి తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
 
‘టన్నెల్’ ఓ యాక్షన్-థ్రిల్లర్ మూవీ అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అడ్రినల్ రష్ ఇచ్చేలా, ఉత్కంఠ రేకెత్తించేలా సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి. క్రైమ్‌లు చేస్తున్న సైకోని పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? అనే పాయింట్‌తో ‘టన్నెల్’ రాబోతోంది. 
 
‘టన్నెల్’ టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి. లచ్చురామ్ ప్రొడక్షన్స్‌ మీద ‘టన్నెల్’ మూవీని తెలుగులో రాజు నాయక్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు