రైనాతో పాటు పబ్‌లో ఉన్న మరో 34 మందిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్టు సమాచారం. సురేష్ రైనాతో పాటు సింగర్ గురు రంధవ, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సహా మొత్తం 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం బెయిల్ మీద కొందరిని విడుదల చేసినట్లు సమాచారం.
Hrithik Roshan - Sussanne Khan
ఇక సురేష్ రైనా విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా గుడ్‌బై చెప్పాడు. మిత్రుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన అరగంటలోనే రైనా కూడా అదే బాట పట్టడం గమనార్హం.