రైనా మోకాలికి ఆపరేషన్-కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్

శనివారం, 10 ఆగస్టు 2019 (12:33 IST)
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా మోకాలికి ఆపరేషన్ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో రైనా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో, ఆమ్ స్టర్ డ్యామ్‌లో మోకాలికి ఆయన చికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ విజయవంతమైనట్టు అక్కడి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రైనా పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారు.
 
రైనా ఆపరేషన్‌పై బీసీసీఐ స్పందించింది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేసింది. ఇంకా ఫ్యాన్స్ అందరూ సురేష్ రైనా త్వరలో కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం చిన్న తల (వైస్ కెప్టెన్) త్వరలో కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు