ఇకపోతే.. తదుపరి మ్యాచ్ చెన్నైతో జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్నాయి. అలాగే టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 23376 వద్ద వుంది. సొంత మైదానంలో ఆడనున్న హైదరాబాద్‌లో జోష్ నింపేందుకు క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మ్యాచ్ టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎల్లో టీమ్ ఆర్సీబీపై గెలిచిన జోష్‌లో వుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
సన్‌రైజర్స్ జట్టులో భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్ ఆడేందుకు సిద్ధంగా వున్నారు. ఏప్రిల్ 5న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య పోరు వుంటుంది. ఏప్రిల్ 5, రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది.