ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ పోరు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు చేపాక్ స్టేడియం వేదికగా మారింది. స్టార్ ప్లేయర్లకు కొదవలేని ఇరు జట్లు ఫేవరేట్‌గా రంగంలోకి దిగుతున్నాయి.