భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడి తరహాలో బాపట్ల కుర్రోడు రెచ్చిపోయాడు. బాపట్లకు చెందిన పల్లప్రోలు రవీంద్ర, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-22 జోనల్స్ పోటీల్లో కేవలం 29 బంతుల్లో 102 పరుగులు చేశాడు. దీంతో అండర్-22 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
జింఖానా క్లబ్ తరఫున ఆడిన రవీంద్ర, జైదుర్ క్లబ్‌తో జరిగిన పోటీల్లో 29 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 58 బంతులాడిన రవీంద్ర, 13 సిక్స్‌లు, 4 ఫోర్లతో 144 పరుగులు సాధించడం గమనార్హం. రంజీ జట్టుకు ఎంపిక కావడం తన తదుపరి లక్ష్యమని, ఆపై భారత జట్టులో స్థానానికి కృషి చేస్తానని చెప్పే రవీంద్ర, లెగ్ స్పిన్నర్‌గా రాణించడం గమనార్హం.