సచిన్ 19 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు చేయగా కోహ్లీ కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. గ్యారీ సోబర్స్ 13, అలిస్టర్ కుక్ 14, బాబ్ సింప్సన్ 16 ఇన్నింగ్స్‌లలోనే ఆ ఘనత అందుకున్నారు. కాగా, చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా సచిన్ సృష్టించిన రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ 232 ఇన్నింగ్స్‌లలో 17 సెంచరీలు చేయగా కేవలం 102 వన్డేలు ఆడిన కోహ్లీ 18 సెంచరీలు బాదాడు.
కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభినవ్ ముకుంద్‌తో కలిసి సమయోచితంగా ఆడిన కోహ్లీ సెంచరీ చేశాడు. 58 టెస్టులు ఆడిన కోహ్లీకి ఇది 17వ సెంచరీ. తానైతే ఎన్ని ఇన్నింగ్స్‌లలో పరుగులు చేయలేకపోయానన్న విషయాన్ని పట్టించుకోనని, అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నప్పుడు ఏ ఫార్మాట్‌లో, ఏ ఇన్నింగ్స్‌లో స్కోరు చేయలేదన్న విషయం అప్రస్తుతమన్నాడు.