Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

సెల్వి

సోమవారం, 21 జులై 2025 (14:53 IST)
Auto
జీవితం అనేది మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణం. ఇందులో ఎన్నో ఒడిదుడుకులు వుంటాయి. ఆనందాలు వుంటాయి. శోకాలు జరుగుతాయి. కానీ చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. 
 
చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే. అలాంటి జీవితాన్ని ఏదో సాగుతుందులే అనుకోకుండా.. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలి. అడ్డంకులను అధిగమించాలి. శోకాలను దూరం వేయాలి. బతుకును హరివిల్లు చేసుకోవాలి అంటారు సైకలాజిస్టులు. 
 
ఇందుకు తాజాగా ఓ వీడియో అద్దం పడుతుంది. జీవితంలో చిన్న అవకాశం దొరికినా దానిని సద్వినియోగం చేసుకోవాలనేందుకు ఈ వీడియో నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. ఆ వీడియో ఏంటంటే.. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ఆటో ఓసారి బోల్తా పడుతుంది. 
 
అయినా ఆ డ్రైవర్ ఏమాత్రం భయపడకుండా ఆటోను సమర్థవంతంగా నడిపి ముందుకు తీసుకెళ్తాడు. జీవితంలో పోరాటాలను తాళలేక ఇబ్బందులు పడుతుంటే ఆ జీవితంలో ఇలాంటి చిన్న అవకాశాన్ని గట్టెక్కేందుకు ఇస్తుంది. ఇలా జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా తేలిగ్గా తీసుకుని ముందుకెళ్లిపోతుండాలని నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

வாழ்க்கை நம்மள போட்டு வெளுக்குறப்ப பாவப்பட்டு இப்டி ஒரு வாய்ப்பு குடுக்கும்... அதை புடிச்சிக்கிட்டு அப்டியே போய்டணும். #happyday ???? pic.twitter.com/poqfhrfFfe

— Rajini (@rajini198080) July 21, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు