వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

సెల్వి

సోమవారం, 21 జులై 2025 (15:04 IST)
Hang
సంగారెడ్డి వోక్సెన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని తన హాస్టల్ గదిలో 19 ఏళ్ల ఆర్కిటెక్చర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
రుషికేశ్ హైదరాబాద్‌లోని సరూర్ నగర్ నివాసి. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. అతని గది నుంచి ఎలాంటి శబ్ధం లేకుండా నిశ్శబ్ధంగా వుండటంతో అనుమానంతో హాస్టల్ సిబ్బంది గది కిటికీలు తెరిచి చూశారు. 
 
అక్కడ రుషికేశ్ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకున్న మునిపల్లి పోలీసులు అతని గది నుండి అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తులో భాగంగా దానిని పరిశీలిస్తున్నారు.
 
ఆత్మహత్య వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. విచారణలో భాగంగా పోలీసులు అతని క్లాస్‌మేట్స్, హాస్టల్ మేట్స్, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు