విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ- లారా రికార్డ్ సమం (వీడియో)

ఆదివారం, 26 నవంబరు 2017 (15:55 IST)
భారత్- శ్రీలంకకు మధ్య నాగ్ పూర్‌లో జరుగుతున్న టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు టీమిండియా బ్యాట్స్‌మెన్లు. రెండో రోజు ఆటలో లంక  బౌలర్లు టీమిండియా ఆటగాళ్లను కట్టడి చేయలేకపోయారు. మురళీ విజయ్ సెంచరీతో అదరగొట్టగా, ఛటేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ టెస్టుల్లో 10వ సెంచరీ పూర్తి చేసుకోగా పూజారా 17వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 
 
ఆపై క్రీజులో నిలదొక్కుకున్న కోహ్ల డ‌బుల్ సెంచ‌రీ బాదాడు. 167.5 ఓవ‌ర్ల వ‌ద్ద సింగిల్‌ చేసి 200 ప‌రుగులు (259 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. తద్వారా కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకుని.. లారా రికార్డుకు సమంగా నిలిచాడు. 
 
మరోవైపు కోహ్లీ డబుల్ సెంచరీతో పాటు ముర‌ళీ విజ‌య్ (128), చ‌టేశ్వ‌ర్ పుజారా (143) అద్భుతంగా రాణించ‌డం, రోహిత్ శర్మ అర్థశతకం బాదడంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు తీస్తోంది. ఇక కోహ్లీ ప్రస్తుతం సాధించిన డబుల్ సెంచరీతో టెస్టుల్లో ఐదో డబుల్ సెంచరీ సాధించినట్లైంది. ఈ క్రమంలో భారత్ 174.4 ఓవర్లలో 1048 బంతులాడి 600 పరుగులు సాధించింది. 

King Kohli scores his 5th double ton in Test cricket #INDvSL pic.twitter.com/k21iKvOZvg

— BCCI (@BCCI) November 26, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు