ఈ మ్యాచ్‌లో అతను తన 74వ వన్డే అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక 50 పరుగులకు పైగా స్కోర్ సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఐసిసి వన్డే ఈవెంట్లలో కోహ్లీ ఇప్పుడు 58 ఇన్నింగ్స్‌లలో 24 యాభైకి పైగా స్కోర్లు సాధించగా, దిగ్గజ బ్యాటర్ 58 ఇన్నింగ్స్‌లలో 23 అలాంటి స్కోర్లు సాధించాడు.
ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్‌లో, కోహ్లీ దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులతో జట్టులో అత్యధిక స్కోరు సాధించగా, అలెక్స్ కారీ 61 పరుగులు సాధించాడు. ఆ తర్వాత భారత్ వన్డే ప్రపంచ ఛాంపియన్లను 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత్ తరఫున మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు పడగొట్టారు.