దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత క్రికెట్టు ఆరంభంలో పేలవమైన ఆటతీరుతో ప్రతి ఒక్కరినీ నిరాశపరిచింది. ముఖ్యంగా, పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇపుడు సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే పోరాడక తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్లిపోయింది.
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ సేన తీవ్ర నిరాశ పర్చింది. ప్రస్తుతం భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ అద్భుతం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ సెమీస్ చేరాలంటే స్కాంట్లాండ్‌పై, నవంబర్8న నమీబియాపై భారీ తేడా(80 పరుగుల తేడాతో లేదా12 ఓవర్లలో చేధన)తో గెలవాలి.
ఇలా గెలిచిన కూడా న్యూజిలాండ్ జట్టు ఆప్ఘానిస్థాన్ చేతిలో తప్పనిసరిగి ఓడిపోవాల్సి ఉంటుంది. 6 పాయిం ట్లతో ఉన్న న్యూజిలాండ్.. ఆప్ఘానిస్థాన్‌పై గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. అప్పుడు భారత్, ఆప్ఘాన్ ఇంటిదారి పడతాయి.