ముషారఫ్ నాకు వార్నింగ్ ఇచ్చారు.. సౌరవ్ గంగూలీ

ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (16:28 IST)
టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి 2004లో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఓ సలహా ఇచ్చారట. పాకిస్థాన్‌లో అర్థరాత్రుల్లో సాహసాలు చేయొద్దంటూ గంగూలీకి సలహా ఇచ్చారట. ఆ దేశ క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్ వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బెంగాల్ టైగర్ తన ఆత్మకథ.. ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్‌లో తెలిపారు. 
 
వన్డే సిరీస్‌ కోసం వెళ్లిన గంగూలీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు లాహోర్‌‌లోని స్విష్ ఫెరల్ కాంటినెంటల్ హోటల్‌లో బసచేసింది. ఆ సిరీస్‌ను దాదా టీమ్ 3-2 తేడాతో గెలుచుకుంది. హోటల్ నుంచి సరదాగా బయటకు వెళ్లి మంచి ఫుడ్ ఐటమ్స్ తినాలని టీమిండియా కోరుకుంది. కానీ, బయటకు వెళ్లాలని చెప్తే సెక్యూరిటీ గార్డులు తనను అడ్డుకుంటారని భావించి.. ముఖం కనిపించకుండా వెళ్లినా హోటల్ వెనుక ద్వారం నుంచి బయటకు వెళ్లానని గంగూలీ తెలిపారు. అలా డిన్నర్ పూర్తి చేసి వచ్చేలోపు జర్నలిస్టులు తమను గుర్తు పట్టారు.
 
ఈ విషయం పాకిస్థాన్ దేశాధ్యక్షుడు ముషారఫ్‌కు తెలిసింది. ముషారఫ్ తనతో మర్యాదగా.. చాలా కఠినంగా ఓ మాట చెప్పారు. ఇంకోసారి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళకండి. తామే సెక్యూరిటీ పంపుతామని.. అర్థరాత్రుల్లో మాత్రం ఇలాంటి సాహసాలు చేయొద్దని గంగూలీ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు