ఈ జాబితాలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ కేవలం 90 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత రుతురాజా గైక్వాడ్ (91), కేఎల్ రాహుల్ (93)లు ఉన్నారు. జైశ్వాల్ నాలుగో స్థానంలో ఉంటే గిల్ (103) ఐదో స్థానంలో ఉన్నాడు.
కాగా, బుధవారం బరస్పరా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో జైశ్వాల్ 29 రన్స్ చేయడంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమిపాలైంది. కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.