ఆధునిక బ్రాడ్ మన్ సచిన్ టెండూల్కర్: లారా కితాబు

FILE
ఆధునిక బ్రాడ్‌మన్ సచిన్ టెండూల్కర్ అని వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా కితాబిచ్చాడు. 16 ఏళ్ల నుంచి 37 ఏళ్ల వరకు ఇంత అద్భుతంగా క్రికెట్ ఆడవచ్చునని సచిన్ తన ఆటతీరుతో నిరూపించాడని లారా అన్నాడు. కాబట్టి క్రికెటర్లందరికంటే సచినే ఉత్తమ క్రీడాకారుడని లారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

సచిన్‌ ఆటతీరును గమనిస్తే మాస్టర్‌కు బ్రాడ్‌మన్‌కు గల సరాసరి వ్యత్యాసాన్ని మనం రోజురోజుకీ మరిచిపోతామని లారా అన్నాడు. అయితే లెజండ్రీల మాటలను గమనిస్తే.. ప్రస్తుతం బ్రాడ్‌మన్ గణాంకాల తరహాలో ఏ ఒక్క క్రికెటరూ సాధించలేరనే విషయం అర్థమవుతోంది.

కానీ తన దృష్టిలో ఆధునిక బ్రాడ్ మన్‌ సచిన్ టెండూల్కరే అని లారా వెల్లడించాడు. ఓ వాణిజ్య ఒప్పందం కోసం దుబాయ్‌ వెళ్లిన లారా గల్ఫ్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అరుదైన రికార్డులతో రాణిస్తున్న సచిన్ టెండూల్కరే నేటి యువ క్రికెటర్లకు స్ఫూర్తి అన్నాడు. కాగా ప్రస్తుతం జింబాబ్వే తరపున ట్వంటీ-20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లాడుతున్న లారా, ప్రస్తుతం గోల్ఫ్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి