ఏప్రిల్ ఒకటిన ధోనీకి ఫిట్‌నెస్ పరీక్ష

వెన్నునొప్పితో కారణంగా రెండో టెస్టుకు దూరమైన టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు. ఇందులో ఫిట్‌నెస్ సాధిస్తే ముడో టెస్టులో ఆడే విషయంపై జట్టు మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. కాగా, న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మూడో వన్డే వెల్లింగ్టన్‌లో జరుగనుంది.

రెండో టెస్టు ప్రారంభానికి ముందు ధోనీకి వెన్నునొప్పి రావడంతో జట్టు సేవలకు దూరమయ్యాడు. ధోనీ గైర్హాజరుతో కెప్టెన్సీ బాధ్యతలను వీరేంద్ర సెహ్వాగ్ నిర్వహించాడు. దీనిపై సెహ్వాగ్ మాట్లాడుతూ.. మూడో టెస్టులో ధోనీ ఆడేదీ లేనిదీ తాను చెప్పలేన్నారు. ఫిట్‌నెస్ పరీక్ష అనంతరమే ధోనీ ఆడేదీ లేనిదీ తెలుస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి