ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు: పాక్ క్రికెటర్లు
FILE
భారత దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గిపోదని పాకిస్థాన్ క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు సోహైల్, మియాందాద్‌లు అన్నారు. ఐపీఎల్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం ఎలాంటి పరిణామాలకు దారితీసినా, ఐపీఎల్ టోర్నీ మాత్రం ఏనాటికీ తన ప్రభావాన్ని కోల్పోదని అమీర్ సోహైల్, జావెద్ మియాందాద్‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ కొచ్చి ఫ్రాంచైజీల వ్యవహారంతో పాటు ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా.. మోడీ స్థానంలో ఎవరైనా నాయకత్వం వహించినా, ఐపీఎల్ భవితవ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పాక్ క్రికెటర్లు చెప్పారు. ఐపీఎల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా.. ఐపీఎల్ టోర్నీకి మాత్రం ప్రేక్షకులకు, అభిమానుల మధ్య మంచి క్రేజ్ లభిస్తుందని పాక్ మాజీ కెప్టెన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐపీఎల్‌లో లలిత్ మోడీ అవకతవకల విషయం ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని, అయినా ఈ వ్యవహారం అంతా బీసీసీఐ, ఐసీసీలు చూసుకుంటాయని పాక్ కెప్టెన్లు వెల్లడించారు.
కానీ ఐపీఎల్ వంటి భారీ లీగ్‌ను నడుపుతున్న వ్యక్తి అన్ని ఆర్థిక వ్యవహారాలను, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను తన అదుపులో ఉంచుకోలేదని చెప్పడం సబబు కాదని పాక్ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి ఐపీఎల్‌లో నెలకొన్న సంక్షోభం మున్ముందు ఎక్కడికి దారితీస్తుందో తెలియదు కానీ, దాని ప్రాభవం మరింత పెరుగుతుందేగానీ ఏ మాత్రం తగ్గదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.