సొంతగడ్డపై జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సూపర్-8కు చేరింది. గ్రూప్-డిలో క్రికెట్ పసికూన ఐర్లాండ్‌తో జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 138 పరుగులు చేసింది.
విండీస్ బ్యాట్స్‌మెన్స్ సామీ (30: 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫ్లేచర్ (19), బ్రావో (18), శర్వాణ్ (24)లు ఓ మోస్తారుగా రాణించాడు. మెరుపు వీరుడు పొలార్డ్ 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
అనంతరం 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు విండీస్ బౌలర్ల జోరుకు 16.4 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో విండీస్ జట్టు 70 పరుగులతో విజయభేరీ మోగించింది. ఐర్లాండ్ ఓపెనర్ ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ కొట్టి పోర్టర్పీల్డ్ (4) ఆ తర్వాతి బంతికే నిష్క్రమించాడు. అక్కడి నుంచి ఐర్లాండ్ వికెట్ల పతనం మొదలైయింది. ఇన్నింగ్స్‌లో ఏక్స్ట్రాస్ రూపంలో వచ్చిన 19 పరుగులే టాస్ స్కోరు కావడం గమనార్హం.