కొత్త జట్టు కోసం యూనిస్, ఇంతికాబ్ చూపులు

త్వరలో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్‌కు సరికొత్త జట్టును ఎంపిక చేసుకునే దిశగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్, ఆ జట్టు కోచ్ ఇంతికాబ్ ఆలమ్ ఆసక్తి చూపుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి అబుదాబి, దుబాయ్‌లలో పాక్-ఆసీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఇటీవల రద్దు అయిన బంగ్లాదేశ్ పర్యటన కోసం పాక్ చీఫ్ సెలక్టర్ అబ్దుల్ ఖాదిర్‌ సూచించిన 16 మంది సభ్యుల జట్టును కెప్టెన్, కోచ్‌ ఇద్దరు తోసిపుచ్చారు.

ఇదే జట్టును ఆస్ట్రేలియా పర్యటనకు కూడా చీఫ్ సెలక్టర్ సూచించగా, దీనికి వారిద్దరు ససేమిరా అన్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ముగించుకుని ఆస్ట్రేలియా జట్టు నేరుగా దుబాయ్‌కు చేరుకుంటుంది. ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా, ఇరు జట్లు ఒక ట్వంటీ-20 మ్యాచ్‌ను సైతం ఆడుతుంది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం పాక్ జట్టును ఏప్రిల్ ఒకటో తేదీన ఎంపిక చేస్తామని ఆలమ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి