క్రెస్ట్‌చర్చ్ వన్డే: ధీటుగా స్పందించిన కివీస్

సొంత గడ్డపై న్యూజిలాండ్ ఆటగాళ్లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. భారత్ నిర్ధేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమమంలో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఫలితంగా, కివీస్ జట్టు 29 ఓవర్లలో 198 పరుగులు చేసింది. ఓపెనర్ రైడర్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ మెక్‌కల్లమ్ 71 పరుగులతో రాణించి, ఓపెనింగ్ వికెట్‌కు 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని కల్పించారు.

మెక్‌కల్లమ్ రనౌట్‌తో పుంజుకున్న భారత్ ఫీల్డర్లు, ఆ వెంటనే టేలర్‌ను కూడా రనౌట్ చేశారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గుప్తిల్‌ను యువరాజ్ సింగ్ వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. దీంతో కివీస్ జట్టు వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. జాకబ్ ఓవరమ్‌ను స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులతో ఆడుతోంది. భారత బౌలర్లు ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి