గండం నుంచి బయటపడుతాం: ద్రావిడ్

నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కష్టాల నుంచి బయటపడుతుందని జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. ఆట చివరిరోజైన సోమవారం భారత ఆటగాళ్లు మరింతగా రాణించి, తాము కష్టాల నుంచి బయటపడతామని చెప్పారు.

ఈ టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ ఓటమి కోరల నుంచి బయటపడిన విషయం తెల్సిందే. అయితే, ఆట నాలుగో రోజున ఓపెనర్ గంభీర్ (102), సచిన్ టెండూల్కర్ (58), రాహుల్ ద్రావిడ్ (62)లు రాణించడంతో ఓటమి గండం నుంచి బయటపడింది.

వెబ్దునియా పై చదవండి