టెస్టుల్లో సత్తా చాటుతాం: కెప్టెన్ ధోనీ

ఆదివారం, 15 మార్చి 2009 (12:26 IST)
ఈనెల 18వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకానున్న మూడు టెస్టుల్లో తమ సత్తా చాటుతామని "టీమ్ ఇండియా" కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, ఐదో వన్డేలో చిత్తుగా ఓడిపోవడం పట్ల క్రికెట్ అభిమానులకు ధోనీ క్షమాపణలు చెప్పాడు. పిచ్‌ను అంచనా వేయడంలో పొరపాటు పడటమే కాకుండా, చెత్త షాట్లు కొట్టడం వల్లే త్వరగా అవుట్ అయినట్టు వివరించాడు.

న్యూజిలాండ్ గడ్డపై ఐదు వన్డేల సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇందుకు జట్టులోని ప్రతి సభ్యునికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపాడు. సిరీస్ ఆరంభం నుంచి మంచి క్రికెట్ ఆడి, పోరాటస్ఫూర్తి ప్రదర్శించినందుకు జట్టు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే, చివరి వన్డేలో క్రికెట్ అభిమానులను పూర్తి నిరాశకు లోనుచేయడం పట్ల క్షమాపణలు కోరుతున్నా అని ధోనీ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.

కివీస్ గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడాం. ఇకముందు కూడా ఇదే తరహా ప్రదర్శన కొనసాగిస్తే టెస్టుల్లో కూడా అద్భుతాలు సృష్టిస్తామని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం మూడు టెస్టులు జరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి