Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

సెల్వి

గురువారం, 17 జులై 2025 (20:21 IST)
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. తన భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చాడు. ఈ ఘటన జరిగిన తీరు భయానకంగా మారింది. భార్యను, ఇద్దరు పసిబిడ్డలను బావిలోకి తోసిన గిరి, అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
స్థానికులు గమనించి అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు కుటుంబ కలహాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు