తడబడిన శ్రీలంక: భారత్ విజయ లక్ష్యం 214

FILE
ముక్కోణపు వన్డే సిరీస్‌లో విజయపరంపరను కొనసాగించిన శ్రీలంక ఐదో వన్డేలో తడబడింది. ఇప్పటివరకు ట్రై-సిరీస్‌లో మూడు విజయాలను నమోదు చేసుకున్న శ్రీలంకకు ఐదో వన్డేలో ధోనీ సేన బ్రేక్ వేసింది.

ఆదివారం మిర్పూర్ మైదానంలో భారత్‌తో జరుగుతోన్న కీలక వన్డేలో శ్రీలంక 46.1 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు శ్రీలంక 214 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయిన లంకను సంగక్కర 68, రణదీప్ 56 పరుగులతో ఆదుకున్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో దిల్షాన్ 33, జయవర్ధనే 5, పెరీరా 11, తుషారా 28 పరుగుల వద్ద అవుటయ్యారు. సమరవీర పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ ముఖం పట్టాడు. అలాగే కదంబీ రనౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే 213 పరుగుల స్వల్ప స్కోరును మాత్రమే చేసి ఆలౌటైంది.

ఇక భారత బౌలర్లలో మిశ్రా, జహీర్‌ఖాన్ చెరో మూడు వికెట్లు తీయగా, త్యాగి, శ్రీశాంత్, యువరాజ్ తలో వికెట్ పడగొట్టారు.

ఇదిలా ఉంటే.. ముక్కోణపు సిరీస్‌లో ఇప్పటివరకు శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపును నమోదు చేసుకుని ఫైనల్‌కు చేరుకుంది. కాగా.. భారత్ ఫైనల్లోకి ప్రవేశించాలంటే శ్రీలంకపై జరిగే ఐదో వన్డేలో తప్పకుండా విజయం సాధించాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి