పాక్‌తో టెస్టు సిరీస్: రికీ పాంటింగ్ సరికొత్త రికార్డు!

FILE
ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. 12వేల పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండోటెస్టు రెండోరోజున మహ్మద్ అమీర్ బౌలింగ్‌లో 40 పరుగును సాధించడంతో పాంటింగ్ ఈ మైలురాయిని చేరాడు.

146వ టెస్ట్‌లో 247వ ఇన్నింగ్స్‌ను ఆడుతున్న 35 ఏళ్ల పాంటింగ్ పేరిట 39 శతకాలున్నాయి. ఇంకా 351 వన్డేలాడిన రికీ పాంటింగ్ 13072 పరుగులు సాధించాడు. అలాగే వన్డేల్లో 29 సెంచరీలను, 79 హాఫ్ సెంచరీలను రికీ నమోదు చేసుకున్నాడు. సచిన్ 167 టెస్ట్‌ల్లో 273 ఇన్నింగ్స్‌ల్లో 47 శతకాలతో 13,539 పరుగులు సాధించాడు.

వెబ్దునియా పై చదవండి