ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ అంపైరింగ్ విధులకు దూరమైన బిల్లీ డాక్ట్రోవ్ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్ డారెల్ హార్పర్‌ను నియమించారు. నేపియర్‌లో భారత్-కివీస్ జట్ల మధ్య ముగిసిన రెండో టెస్టుకు ఫీల్డ్ అంపైర్‌గా డాక్ట్రోవ్ విధులు నిర్వహిస్తుండగా, ఛాతి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడు. దీంతో ఆయన స్థానంలో స్టాండ్ బై అంపైర్ ఎవన్ వాట్కిన్స్‌కు ఫీల్డ్ అంపైరింగ్ బాధ్యతలు అప్పగించారు.
ఈ నేపథ్యంలో డాక్ట్రోవ్ పూర్తిగా కోలుకోక పోవడంతో ఆయన స్థానంలో డారెల్ హార్పర్‌ను నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయం తీసుకుంది. కాగా, మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరి టెస్టు ఏప్రిల్ మూడో తేదీ నుంచి వెల్లింగ్టన్ మైదానంలో ప్రారంభంకానుంది.