రెండు వేల పరుగుల క్లబ్‌లో గౌతం గంభీర్

భారత ఓపెనర్ గౌతం గంభీర్ రెండు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. మెక్‌లీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు నాలుగో రోజైన ఆదివారం గంభీర్ ఈ ఘనతను సాధించాడు. టెస్టుల్లో రెండు వేల పరుగుల క్లబ్‌లో చేరిన 30వ భారత క్రీడాకారుడు కావడం గమనార్హం. ఈ రికార్డును సాధించేందుకు గంభీర్‌కు 43 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.

అంతేకాకండా అత్యం వేగవంతంగా పరుగులు చేసి ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో విజయ్ హజారే, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తన కెరీర్‌లో 24వ టెస్ట్ ఆడుతున్న గంభీర్.. 50 సగటుతో కొనసాగుతున్నాడు. నాలుగో రోజున జీతన్ పటేల్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని నెట్టి రెండు పరుగులు తీయడంతో 2000 పరుగులు పూర్తి చేశాడు.

ఈ టెస్టులో ఢిల్లీ లెఫ్ట్ హ్యండర్ బ్యాట్స్‌మెన్‌ సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెల్సిందే. రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, విజయ్ హజారే, గౌతం గంభీర్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు వేగంగా పరుగులు చేసి రెండువేల క్లబ్‌లో చేరిన బ్యాట్స్‌మెన్స్‌గా పేరుంది.

వెబ్దునియా పై చదవండి