రెండో ట్వంటీ-20: కంగారూలపై సఫారీల విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-ట్వంటీలో దక్షిణాఫ్రికా 17 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరింపించింది. దక్షిణాఫ్రికా ముందుంచిన 157 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

డీజే హస్సీ (27), క్లార్క్ (27), వైట్ (23), వార్నర్ (20)ల తప్ప కంగారూల బ్యాట్స్‌మన్లు అంతగా రాణించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టులో వాండర్ మెర్వ్ (48 పరుగులతో) అర్థసెంచరీని మిస్ చేసుకున్నాడు.

మెర్వ్‌తో పాటు పీటర్సన్ (34), డుమిని (23), గిబ్స్ (20)లు నిలకడగా ఆడి, దక్షిణాఫ్రికా జట్టుకు పరుగులను సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్వూడ్ రెండు వికెట్లు పడగొట్టగా, బ్రాకెన్, లాహ్లీన్, హోప్‌లు తలా ఓ వికెట్‌ను సాధించారు. ఇదేవిధంగా ఆసీస్ బౌలర్లలో బోథా, లావో రెండేసి వికెట్లు పడగొట్టగా, అబ్ధుల్లా, మార్కెల్, మెర్వ్‌లు ఓ వికెట్ చొప్పున మూడు వికెట్లు సాధించారు.

ఇదిలా ఉండగా, తొలి టీ 20లో కూడా దక్షిణాఫ్రికానే గెలుపును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి