శ్రీలంక కొత్త కెప్టెన్‌గా కుమార సంగక్కర

శ్రీలంక సెలెక్టర్లు బుధవారం కీపర్ కుమార సంగక్కరకు జాతీయ క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు. కాగా, శ్రీలంక క్రికెట్ జట్టుకు 2006 నుంచి సంగక్కర వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..!

ఇటీవలనే... కెప్టెన్ మహేళ జయవర్దనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో, సంగక్కరకు ఈ అవకాశం వచ్చింది. అలాగే వైస్‌కెప్టెన్సీ బాధ్యతలను ఆఫ్‌స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కు సెలెక్టర్లు అప్పజెప్పారు. వీరిద్దరి సారథ్యంలో శ్రీలంక జట్టు జూన్‌లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాల్గొననుంది.

ఈ టోర్నమెంట్ కోసం శ్రీలంక సెలెక్టర్లు 25 మందితో కూడిన సభ్యుల బృందాన్ని కూడా ఎంపిక చేశారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే దేశవాళీ ట్వంటీ 20 టోర్నమెంట్ అనంతరం తుది 15 మందిని ఎంపిక చేస్తారు.

జట్టు సభ్యుల వివరాలు :
కుమార సంగక్కర (కెప్టెన్), ముత్తయ్య మురళీధరన్ (వైస్ కెప్టెన్), సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్, మహేళ జయవర్ధనే, చమర కపుగెదర, జెహన్ ముబారక్, చమర సిల్వ, ఏంజిలో మాథ్యూస్, ఫర్వేజ్ మహరూఫ్, నువాన్ కులశేఖర, దిలాన్ తుషార, లతీష్ మలింగ, చమింద వాస్, అజంత మెండీస్, కౌశల్ వీరరత్నే, ఉపుల్ తరంగ, ఇసురు ఉదన, దిల్హర లొకుహెట్టిగె, చింతక జయసిన్హే, నువాన్ జోయ్‌సా, గిహన్ రుపసింగే, దిలాన కడంబీ, మలింగ బన్‌డర, దిల్‌హర ఫెర్నాండో.

వెబ్దునియా పై చదవండి