షోయబ్‌-సానియాలకు వాసిమ్ అక్రమ్ శుభాకాంక్షలు!

PTI
పలు వివాదాల మధ్య ఈ నెల 15వ తేదీన వివాహం చేసుకోబోతున్న పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు పాక్ మాజీ కెప్టెన్ వాసిమ్ అక్రమ్ వివాహ శుభాకాంక్షలు తెలియజేశాడు. షోయబ్, సానియాలకు వాసిమ్ అక్రమ్ ఆదివారం వివాహా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సిద్ధిఖీ, అయేషా వివాదం మాలిక్‌కు కెరీర్‌కు మంచిది కాదన్నాడు.

షోయబ్ మాలిక్-సానియా మీర్జాల వివాహ విషయం అందరినీ ఆనందంలో ముంచెత్తినా.. అయేషాను మాలిక్ వివాహామాడాడని, సానియా మీర్జా మాలిక్‌కు రెండో భార్యగా మాత్రమే ఉంటుందని, సిద్ధీఖీ షోయబ్‌పై కేసు పెడతారని వెలువెత్తిన ఆరోపణలు షోయబ్‌కు మంచివి కావని వాసిమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు.

అయేషాతో తొలి వివాహం, ఆమెతో మాలిక్‌కు ఉన్న సంబంధాలపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయాన్ని పక్కన పెడితే, అలాంటి విమర్శల వల్ల మాలిక్‌కు లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అక్రమ్ చెప్పాడు. ఏది ఏమైనా..? త్వరలో ఒక ఇంటివారు కాబోతున్న షోయబ్ మాలిక్, సానియా మీర్జాలు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని వాసిమ్ అక్రమ్ ఆకాంక్షించాడు.

ఇదిలా ఉంటే.. షోయబ్ మాలిక్- సానియా మీర్జాల పెళ్లి వివాదానికి ఇంకా తెరపడలేదు. షోయబ్ పెళ్లి విషయాలపై మంతనాలు జరిపేందుకు శనివారం హైదరాబాద్‌లోని సానియా ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే.

ఒకవైపు షోయబ్ తనను వివాహమాడి మోసం చేశాడంటూ ఆయేషా ఆరోపిస్తుండగా, మరోవైపు ఆమె తండ్రి సిద్ధిఖీ మాలిక్‌పై కేసుపెడతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ ఆయేషా వివాదానికి ఎలా ఫుల్‌స్టాఫ్ పెట్టి, సానియాను వివాహమాడుతాడో..? వేచి చూడాల్సిందే..!

వెబ్దునియా పై చదవండి