సీఎల్ ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ చెల్లించని బీసీసీఐ!

ఛాంపియన్స్ లీగ్ విజేతలకు ప్రైజ్‌మనీ చెల్లించడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి జాప్యం చేస్తోంది. ప్రపంచంలో సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ సీఎల్ టీ-20 టోర్నీ విజేత న్యూ సౌత్ వేల్స్ (ఆస్ట్రేలియా)కు దాదాపు రూ. 12 కోట్ల ప్రైజ్ మనీనీ ఇంకా చెల్లించలేదు. ఈ ప్రైజ్‌మనీలో సగ భాగం న్యూ సౌత్ వేల్స్‌కు ఖాతాలో చేరనుండగా, మిగిలిన సగం ఆటగాళ్లు పంచుకుంటారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్టోబరు నెలలో జరిగిన ట్వంటీ-20లో ట్రినిడాడ్ అండ్ టొబాగో (వెస్టిండీస్)‌ను ఓడించి న్యూ సౌత్ వేల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ముగిశాక 20 రోజుల్లో ప్రైజ్‌మనీ చెల్లిస్తామని చెప్పిన బీసీసీఐ, ఇప్పటివరకు ప్రైజ్‌మనీని అందజేయలేదని డైలీ టెలిగ్రాఫ్‌తో న్యూ సౌత్ వేల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గిల్బర్ట్ అన్నారు.

ఇంకా నిబంధనల ప్రకారం అక్టోబరులో టోర్నీ ముగిస్తే విజేతలకు నవంబరులోపు ప్రైజ్‌మనీ అందజేయాలి.. కానీ బీసీసీఐ జాప్యం చేస్తోంగని న్యూ సౌత్ వేల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గిల్బర్ట్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి