ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్

శనివారం, 20 డిశెంబరు 2014 (13:01 IST)
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ నియమితులయ్యారు. ప్రస్తుత కెప్టెన్ అలిస్టర్ కుక్‌కు జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. 
 
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌తో పాటు.. వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ పోటీలకు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహిస్తారని తెలిపింది. గత కొంతకాలంగా ఫాం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కుక్, గత 22 ఇన్నింగ్సులలో కేవలం ఒక సెంచరీ మాత్రమే చేశాడు. 
 
ఆయన నేతృత్వంలో ఇంగ్లాండ్ ఆడిన చివరి 6 సిరీస్‌లలో 5 సిరీస్‌లలో ఓడిపోయింది. కుక్ కెప్టెన్సీలో 69 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ 36 మ్యాచ్‌లలో గెలిచింది. 

వెబ్దునియా పై చదవండి