ఐపీఎల్ ప్రత్యేక గుర్తింపు నిచ్చింది: మొహ్నీష్ మిశ్రా

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తనకు కొత్త గుర్తింపును సంపాదించి పెట్టిందని కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ మొహ్నీష్ మిశ్రా అన్నాడు. డెక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్‌లో ఆడిన మొహ్నీష్ మిశ్రా.. ట్వంటీ-20 ఫార్మాట్‌లోని ఎన్నో మెలకువలను గ్రహించానని చెప్పాడు.

ఐపీఎల్‌లో ఆడటం ద్వారా సీనియర్ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నానని మిశ్రా అన్నాడు. స్టార్ క్రికెటర్లు అయిన ఆడమ్ గిల్‌క్రిస్ట్, గిబ్స్, ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి ఆడటం కొత్త అనుభూతినిచ్చిందని అతడు తెలిపాడు.

ఇప్పటివరకు ఆడిన 11 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 166 పరుగులు సాధించిన మిశ్రా.. వచ్చే ఏడాది కూడా డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడుతానని స్పష్టం చేశాడు.

ఇకపోతే.. కరేబియన్ గడ్డపై జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీం ఇండియా ధీటుగా రాణిస్తుందని మిశ్రా నమ్మకం వ్యక్తం చేశాడు. అలాగే అద్భుతమైన బ్యాటింగ్ లైన్‌అప్ కలిగిన భారత్‌కు కప్‌ను గెల్చుకునే సత్తా ఉందని మిశ్రా చెప్పుకొచ్చాడు.

వెబ్దునియా పై చదవండి