ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సిద్ధం: దక్షిణాఫ్రికా

శుక్రవారం, 13 మార్చి 2009 (09:58 IST)
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు తాము సిద్ధమని దక్షిణాఫ్రికా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నుంచి అధికారపూర్వక సమాచారం అందుకున్న వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఛైర్మన్ వెల్లడించారు.

గత యేడాది పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని భద్రతా కారణాల దృష్ట్యా వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని తొలుత ప్రతిపాదించారు. అయితే, వచ్చే సెప్టెంబరు కాలంలో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తాయని, వీటివల్ల మ్యాచ్‌లకు తీవ్ర అంతరాయం కలుగుతుందని భావించిన ఐసిసి, వేదికను దక్షిణాఫ్రికాకు మార్చారు. ఈ మేరకు ఐసిసి కార్యనిర్వహణ బోర్డు ప్రాధమికంగా ప్రతిపాదించింది.

వచ్చే సెప్టెంబరులో ఈ టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తామని ఐసిసి సీఈఓ హరూణ్ లోర్గాట్ బుధవారం వెల్లడించారు. దీనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. ఐసిసి నుంచి అధికారిక సమాచారం అందలేదని, ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే తాము నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి