భువనేశ్వర్‌లో మే 16న భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పెళ్లి!
భారత స్పిన్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టి అందరిని ఆకట్టుకున్న ప్రముఖ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు మే 16న భువనేశ్వర్‌లో పెళ్లి జరుగుతుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మైక్రో బయాలజీలో పీజీ చేస్తున్న కరాబి బారల్‌తో ఓజా పెళ్లి జరగనుందని వారు చెప్పారు.
భువనేశ్వర్‌లోని హోటల్ మే ఫెయిర్ లాగూన్‌లో ప్రజ్ఞాన్ ఓజా-కరాబి బారల్‌తో వివాహం జరుగుతుందని ఓజా కుటుంబీకులు వెల్లడించారు. రిసెప్షన్ మాచ్రం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. గత ఏడాది ఓ ఫంక్షన్‌లో కరాబి బారల్‌ను చూసిన ప్రజ్ఞాన్ ఓజా ఆమె ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 5, 1986లో ఒరిస్సాలోని కుద్రా జిల్లాలో పుట్టిన ఓజా భువనేశ్వర్‌లో క్రికెట్ ఆరంగేట్రం చేశాడు తర్వాత రంజీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓజా, జూన్ 9, 2009లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అదే సంవత్సరం, నవంబరులో టెస్టుల్లో చోటు సంపాదించుకున్నాడు.