ముంబయిలోని శివాజీ పార్క్ జింఖానాలో మే 9వ తేదీన జరుగనున్న విజయ్ మంజ్రేకర్ డబుల్ వికెట్ క్రికెట్ టోర్నమెంట్‌లో రాబిన్ ఊతప్ప, సౌరభ్ తివారీలు పాల్గోనున్నారు. తాజాగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో రెండు వేరు వేరు ఫ్రాంచైజీల తరపున ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు.. మే 9న జరిగే డబుల్ వికెట్ టోర్నీలో ఆడనున్నారు.
తివారీతోపాటు ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు శిఖర్ ధావన్ మరియు అంబటిరాయుడులతో కలిసి సంజయ్ బంగర్, రమేష్ పవార్‌లు కూడా విజయ్ మంజ్రేకర్ మెమోరియల్ టోర్నీలో ఆడనున్నారు. మొత్తంమీదా రూ. 3.42 లక్షలు ప్రైజ్‌మనీగా కలిగిన ఈ టోర్నీ విజేతకు 60 వేల రూపాయలను, రన్నరప్‌కు 40 వేల రూపాయలను ఫ్రైజ్‌మనీగా అందజేయనున్నట్లు ఈ మేరకు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ డబుల్ వికెట్ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక టోర్నమెంట్‌లలో పాల్గొన్న మాజీ క్రికెటర్లను జింఖానా సెక్రటరీ డాక్టర్ వికాస్ దుబేవర్ సన్మానించనుండటం విశేషంగా చెప్పవచ్చు.