మోడీ వ్యవహారంపై కఠిన చర్యలకు బీసీసీఐ సిద్ధం: శుక్లా

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ లలిత్ మోడీపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమవుతోందని బీసీసీఐ మీడియా మరియు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలియజేశారు. ఐపీఎల్‌లో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీపై బీసీసీఐ గుర్రుగా ఉందని శుక్లా అన్నారు.

ఆదాయ పన్ను శాఖ ఆధారాల అనుగుణంగా లలిత్ మోడీపై కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుందని శుక్లా చెప్పారు. ఇందులో భాగంగా మోడీపై ఆరోపణలు రుజువైతే ఛైర్మన్ పదని నుంచి మోడీని తప్పించేందుకు బీసీసీఐ ఏ మాత్రం వెనుకంజ వేసేది లేదని శుక్లా స్పష్టం చేశారు.

వివాదాస్పదమైన కొచ్చి ఫ్రాంచైజీ వివాదంపై ఈ నెల 26వ తేదీన జరుగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు అనంతరం లలిత్ మోడీ తగిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ సంసిద్ధమైందని శుక్లా వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. లలిత్ మోడీ వ్యవహారంపై సరైన నిర్ణయం తీసుకునేందుకుగాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ)కి కాబోయే అధ్యక్షుడు శరద్ పవార్‌తో బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు.

వెబ్దునియా పై చదవండి